బాపట్ల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమారి మాట్లాడుతూ, దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపై ప్రయాణించడం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని తెలిపారు. శుక్రవారం నగరం మండలంలో వాహనాల తనిఖీ చేపట్టి, రెండు ట్రాక్టర్లకు జరిమానా విధించారు. ట్రాక్టర్ యజమానులకు సాధారణ టైర్లతోనే రోడ్లపై ప్రయాణించాలని సూచించారు. డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ టి. కె. పరంధామ రెడ్డి ఆదేశాల మేరకు, ట్రాక్టర్ యజమానులకు రహదారి భద్రతా ప్రమాణాలను వివరించారు.