వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలోని బెస్తగేరి ఆంజనేయస్వామి వారి ఆలయంలో సోమవారం నిర్వహించిన ఆంజనేయ స్వామి మాల ధారణ చేసిన స్వాముల ఇరుముడి మహోత్సవ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన స్వాములతో కలిసి ఆంజనేయ స్వామికి వారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో ఆధ్యాత్మికతను పెంపొందించే ఇలాంటి మాలధారణ కార్యక్రమాలు మనలో ఐక్యతను పెంపొందిస్తాయని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో గ్రామంలోని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు