కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కృషితో చెన్నై-నరసాపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించనుంది. భీమవరంలో శుక్రవారం సాయంకాలం 5:30 కు జరిగిన బీజేపీ ‘సారథ్యం’ సభలో పాల్గొంటున్న సమయంలోనే కేంద్ర రైల్వే మంత్రి కార్యాలయం నుంచి శ్రీనివాస వర్మకు ఈ సమాచారం అందిందని స్వయంగా కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి, రెండు జోన్ల మధ్య సమన్వయం చేసి నరసాపురంకు తొలి వందే భారత్ సాధించిన ఘనత ఆయనకే దక్కిందని బిజెపి శ్రేణులు వర్షం వ్యక్తం చేశారు.