Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 29, 2025
కందుకూరులోని MIG లేఔట్లు, జగనన్న కాలనీల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేయాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంత్రి నారాయణను కోరారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఎంక్వయిరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేస్తామని.. తప్పిదం చేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.