ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడి పర్యావరణాన్ని కాపాడాలంటూ విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో సైకత శిల్పాలతో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొందరు సైకత కళాకారులు ఇసుకతో ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని తెలియజేస్తూ వివిధ రూపాల్లో శిల్పాలను రూపొందించి చూపరులను ఆకట్టుకున్నారు. ఈ శిల్పాలలో ప్లాస్టిక్‌తో కాలుష్యం అవుతున్న సముద్రాలు, వాటి వల్ల ఇబ్బందులు పడుతున్న జీవరాశుల గురించి ప్రదర్శించారు.