నగరంలోని కోటగల్లిలో గల నీలం రామచంద్రయ్య భవన్లో PDSU ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కార దిశగా ఈ నెల 25 తేదీ నుండి 30 వరకు జరిగే విద్యార్థి పోరుబాటను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వలన ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థల్లో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు, కళాశాలలను నడిపిస్తున్న ,ఫీజులు దోపిడీ చేస్తున్న, ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.