మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని కాంట్రాక్టర్ దూదిమెట్ల శివ యాదవ్ బీసీ కమిషన్ ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు. నాసిరకం పనులు చేయనందుకు తనను కులం పేరుతో దూషించి, రౌడీలను పంపి భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. తనకు పోలీసులు రక్షణ కల్పించాలని ఆయన కోరుతున్నారు.