రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన కొలుకుల లక్ష్మి (70) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు,ఒక కుమారుడు ఉన్నారు. కోడలి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.