మంగళవారం రాత్రి 9 గంటల నుండి 10 గంటల ప్రాంతంలో వరంగల్ నగరంలోని మట్టవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గణపతి మండపాలను మట్టేవాడ సిఐ కరుణాకర్ తో కలిసి సందర్శించారు వరంగల్ ఏసిపి నాగాలే శుభం ప్రకాష్ ఐపిఎస్. ఈ సందర్భంగా మండప కమిటీ సభ్యులతో సమావేశమై సిపి గారిచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అంతేకాకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పాలని డీజే సౌండ్ సిస్టం వినియోగాన్ని నివారించాలన్నారు. అలాగే విగ్రహ నిమర్జనం స్థలాలలో పోలీసులకు సహకరించి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.