ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏకపక్షంగా కాల్చి చంపడాన్ని వెంటనే ఆపాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపాలని ఆత్మ కమిటీ ఛైర్మన్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు. మరిపెడలో జరిగిన పార్టీ కౌన్సిల్ సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడారు. కురవిలో జులై 5, 6వ తేదీల్లో జరిగే సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలన్నారు.