గత కొన్ని సంవత్సరాలుగా పలు జిల్లాల్లో దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన అంతర్ జిల్లా నేరస్తున్ని పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత మే నెలలో సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగధాంపల్లి వద్ద గల విఘ్నేశ్వర నగర్ లోని ఓ ఇంట్లో పదిన్నర తులాల బంగారం దొంగతనం జరిగింది. త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ మేరకు మంగళవారం సిద్దిప