సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్, పైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిసి మైత్రివనం సమీపంలోని కలుషితమైన నాలాను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ నాలా వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు నాలా పరిస్థితిని స్వయంగా పరిశీలించిన అధికారులు సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాలాను శుభ్రం చేయించారు.