చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో మరొకమారు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే, వైసీపీపార్టీ పీఏసీ సభ్యులు పుప్పాల వాసుబాబు అన్నారు. వైసీపీపార్టీ అధినాయకత్వం పిలుపుమేరకు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఈనెల 4వ తేదీన చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమ పోస్టర్ ను బువ్వనపల్లి కార్యాలయంలో సోమవారం సాయంత్రం పార్టీ శ్రేణులతో కలిసి వాసుబాబు ఆవిష్కరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో పబ్బం గడుపుకోవడానికి అమలుకాని వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, హామీలు అమలుకు వైసీపీ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు.