నిండుకుండలా గాజులదిన్నె ప్రాజెక్టు.. నీటి విడుదల గోనెగండ్ల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టుకు ఎగువ కురుస్తున్న భారీ వర్షాల వల్ల వేయి క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులో 4.3 టీఎంసీల నీరు ఉంది.దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 4వ నంబర్ క్రస్ట్ గేటు ద్వారా 500 క్యూసెక్కుల నీటిని హంద్రీలోకి వదిలినట్టు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజినీర్ మహమ్మద్ అలీ తెలిపారు. హంద్రీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.