విజయనగరం జిల్లా కొత్తవలస రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బాలాజీరావు తన సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మృతుని వయస్సు సుమారు 30 నుంచి 35 ఉంటుందన్నారు. ఎరుపు రంగు ఫుల్ హ్యాండ్ టీ షర్ట్, లైట్ కలర్ గ్రే కలర్ లోయర్ ధరించినట్లు చెప్పారు. చామన చాయ రంగు, 5 అడుగుల 6 అంగుళాల హైట్ ఉన్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9490617089 సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామన్నారు.