మిద్ది పైనుంచి పడి మహిళ పరిస్థితి విషమం మిద్దె పైన బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి పరిస్థితి విషమించింది. మదనపల్లి మండలంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘటనపై పోలీసులు బాధితురాలు కుటుంబీకుల కథనం.. మండలంలోని కోళ్ల బైలు గ్రామం బాబు కాలనీలో కాపురం ఉంటున్న రామకృష్ణ భార్య గంగాదేవి బట్టలు ఉతికి మిద్ది పైన ఆరేస్తుండగా, ప్రమాదవశాత్తు కింద పడి తల పగిలి తీవ్రంగా గాయపడింది. బాధిత్రాలని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతమైన పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు వెళ్లాలని డాక్టర్లు రెఫర్ చేశారు. ఘటనపై తాలూక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..