హంద్రీనీవా ప్రాజెక్టుపై టిడిపి, వైసిపి నేతల మద్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ హయాంలోనే హంద్రీనీవా పనులు జరిగాయంటూ ఒకరిపై ఒకరు సవాల్ ప్రతి సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకేంద్రంలో చర్చకు సిద్ధమా అని ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు చేసిన సవాల్ కు వైసిపి ఎంఎల్సి వై. శివరామిరెడ్డి ఉరవకొండ నియోజకవర్గంలోనే బహిరంగ చర్చకు రావాలని ప్రతిసవాల్ విసిరారు. దీంతో శివరామిరెడ్డి సవాల్ ను ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు స్వీకరించారు. ఉరవకొండ నియోజకవర్గంలోనే జీడిపల్లి రిజర్వాయర్ వద్దే బుధవారం ఉదయం బహిరంగ చర్చకు రావాలని, తాను అక్కడికి వస్తానని, శివరామిరెడ్డి కూడా రావాలన్నారు.