వరంగల్ పోలీస్ కమిషనరేట్లో గత 12 సంవత్సరాలుగా సేవలందించిన పోలీస్ జాగిలం బ్రోనోకు అధికారులు పదవి విరమణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్లో సుదీర్ఘకాలంగా సేవలందించిన బ్రో ను, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఘనంగా సత్కరించారు. ట్రాకర్ జాగీలంగా గుర్తించబడిన బ్రోను కమిషనరేట్ లో 15 కీలకమైన కేసుల్లో నిందితులను గుర్తించింది. ఈ జాగిలం హ్యాంగ్లర్ గా ఏ ఎస్ ఐ ఆనంద్ వ్యవహరించారు.