గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజార్లోని ఆర్యవైశ్య సంఘం, ఎస్బీజీ యూత్ ఏర్పాటు చేసిన గణనాథుడు శుక్రవారం భక్తులకు ధననాథుడిగా దర్శనమిచ్చారు. ఉత్సవ నిర్వాహకులు ఏకంగా 2.35 కోట్లు విలువైన కరెన్సీ నోట్లతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అద్భుతమైన అలంకరణను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది.