అనంతపురం జిల్లా కేంద్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ఏర్పాట్ల పనులను మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో వివిధ శాఖల మంత్రులు స్వయంగా పరిశీలించారు. జిల్లా కేంద్రం లోని జిఎంఆర్ గ్రౌండ్స్ లో బుధవారం నిర్వహించనున్న సభకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్న సందర్భంగా నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్, రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత, ఇతర ముఖ్య నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులతో కలిసి పరిశీలించారు.