పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం దుగ్గి గ్రామ సమీపంలో గల పంట పొలాల్లో ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్టు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో అధికారులు తెలిపారు. ఏనుగులతో అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట రైతులు పొలాలకు వెళ్లవద్దని తెలిపారు. గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా మంటలు ఏర్పాటు చేసి ఏనుగులను ట్రాకర్ లు పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు.