శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం LRG విద్యాసంస్థలలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించగా మండల విద్యాశాఖ అధికారి గంగప్ప హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను, ఔ నత్యాన్ని వాడుక భాష కోసం గిడుగు రామమూర్తి పోరాటాన్ని గంగప్ప వివరించారు. ఇతర భాషలను నేర్చుకోండి కానీ మాతృభాషను మరిచిపోకండి "మమ్మీ" " డాడీ" వదిలేయండి అమ్మా, నాన్నతో పేర్లతో పిలవండి." ఆంటీ" "అంకుల్" వదిలేయండి "అత్తా" "మామ" పేర్లతో పిలవండి . చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష కోసం చేసిన కృషి అష్టదిగ్గజ కవులు, ఇతర భాషల కవులు తెలుగు భాష పై చూపిన మమకారాన్ని వర్ణించారు.