ఆత్మకూరు పట్టణంలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలను చూసి పట్టణవాసులు భయపడి పోతున్నారు. పట్టణంలోని కేజీ రోడ్డు, కప్పల కుంట్ల,పాత బస్టాండ్, గరీబ్నగర్,ఎమ్మెల్యే వీది, ఇలా అనేక వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతుండడంతో పట్టణవాసులు భయపడిపోతున్నారు. వీటిని మున్సిపల్ అధికారులు వేరే ప్రాంతాలకు తరలించాలని,ఇప్పటికే పలుమార్లు చాలా మందిపై కుక్కలు దాడి చేశాయని, వర్షాకాలం కావడంతో,కుక్కలు కరిస్తే ఇబ్బందులు పడతామని కావున అధికారులు వీటిని మరో ప్రాంతానికి తరలించాలని పట్టణవాసులు కోరుతున్నారు.