Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 10, 2025
లింగసముద్రం మండలంలోని జంగారెడ్డి పాలెం గ్రామంలో నాటు సారా తయారీ జరుగుతుందన్న సమాచారం మేరకు, ఎస్ఐ నారాయణ తన సిబ్బందితో బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడుల్లో నాటు సారా తయారీకి ఉపయోగించే 50 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు.