కూటమి ప్రభుత్వం రీ వెరిఫికేషన్లో భాగంగా జారీచేసిన సదరం సర్టిఫికెట్లో తప్పులు ఉన్నాయని, వాటిని సవరించాలని ఆల్ ఆఫ్ యూ దివ్యాంగుల సేవా సొసైటీ రాష్ట్ర కన్వీనర్ అఫ్టల్ కోరారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సదరం సర్టిఫికెట్లో ఫోటోలు మార్చారని, పేర్లు, పర్సెంటేజీని తప్పుగా నమోదు చేశారన్నారు. తప్పులను సవరించి అర్హులైన దివ్యాంగులు అందరికీ కూటమి ప్రభుత్వ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.