వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు ఉదయం 3 గంటల నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్న సుమారు 1000 మంది రైతులు. వారం రోజుల నుండి యూరియా కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. ఆందోళన తీవ్రతరం కావడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు రైతులకు సర్దిచెప్పి పోలీసుల ప్రహారా నడుమ యూరియాను పంపిణీ చేస్తున్నారు. కలెక్టర్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. అందరికీ యూరియా వచ్చేంతవరకు ఇకనుండి వెళ్ళేది లేదని అంటున్న పరిస్థితి రాయపర్తి లో నెలకొంది.