కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమిపూజ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామంలో 'పనుల జాతర' కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణానికి శుక్రవారం సాయంత్రం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్ హాజరై, ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంకుడు గుంతల వల్ల భూగర్భజలాలు పెరుగుతాయని, నీటి సమస్య తగ్గుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.