రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని బిజెపి నాయకుడి పై బడంగ్పేట డివిజన్ మదిలోని 29వ వార్డులో స్థానిక కార్పొరేటర్ అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్న బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్. సోమవారం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించారు. బిజెపి నేత మహేందర్ పై బిఆర్ఎస్ కార్పొరేటర్ అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.