మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా శుక్రవారం స్థానిక వ్యాపారులు ఇబ్రహీంపట్నం సాగర్ హైవే, మంచాల రోడ్డు, పాత బస్టాండ్ రోడ్డులో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. 'మార్వాడి హటావో తెలంగాణ బచావో, గో బ్యాక్ మార్వాడి.. సేవ్ తెలంగాణ' అంటూ నినాదాలు చేశారు. కిరాణా, వస్త్ర, వర్తక, స్వర్ణకార, విశ్వబ్రాహ్మణ, ఇతర వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు.