చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా రాజంపేట పార్లమెంట్ సభ్యులు వెంకట మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రవేట్ బస్టాండులో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన వైఎస్ఆర్సిపి నాయకులు. గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్ అలిమ్ భాషా ,మాట్లాడుతూ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ప్రజల్లో ఉన్న ఆధారణ చూసి ఓర్వలేక ఎంపీ మిథున్ రెడ్డి పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.