సిరికొండ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు భారత రాజకీయాలపై, ప్రధాని మోడీపై,ఎలక్షన్ కమిషన్ విధానంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు.కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలు అధికారంలో ఉందని, అప్పుడు ఓటు చోరీకి పాల్పడ్డారా, ఓటు చోరిచేసి కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారా అని ప్రశ్నించారు. మరోసారి నరేంద్ర మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు సంజీవ్, రంజిత్ పలువురు పాల్గొన్నారు.