మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె ఉమా ఏడవ వర్ధంతి సందర్భంగా శనివారం అనంతపురం నగరంలోని పల్లె ఉమా ఘాట్ వద్ద మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.