సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం శనివారం సాయంత్రం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సూర్యాపేట పట్టణ కేంద్రంలో ప్రమాదాలు జరిగే ఆరు ప్రదేశాలను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్పీడ్ బ్రేకర్ల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. వాహనదారుల్లో మార్పు రావడంలేదని మితిమీరిన వేగం, నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. 18 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లు, వాహనాలు ఇవ్వవద్దని హెచ్చరించారు.