జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, విశాఖ పోర్ట్ అధారిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఇన్వెంటరీ క్లర్క్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు శనివారం సాయంత్రం తెలిపారు. ఈనెల 12నుంచి రెండు నెలలు పాడేరులో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. 10, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.