బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీలను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. 42% రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని, పార్లమెంటులో ఎన్డీయే కూటమి మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. బీసీ బిల్లు 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద నిలిచినదీ, స్థానిక ఎన్నికల్లో బీజేపీ అడ్డుపడతుందనే హెచ్చరికతో 28వ తేదీ నుంచి ‘బీజేపీ హటావో, బీసీలకు బచావో' నినాదంతో తిరుగుతామన్నారు.