పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను సిరిసిల్ల పట్టణంలోని చేనేత విగ్రహం వద్ద దగ్ధం చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీపై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు మేము పార్టీ మారలేము అంటూ మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్ కు రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించాలని తెలిపారు. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామనడం ప్రజలకే అవమానమని తెలంగాణ ప్రజలు మీ అం