యాదాద్రి భువనగిరి జిల్లా, మోట కొండూరు మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఈనెల 6న తిరుమలపూర్ లో జరిగే సీఎం బహిరంగ సభ విజయవంతం చేయాలని కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బుగ్గ కొమరయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తుర్కపల్లి మండల పరిధిలోని తిరుమల పూర్ గ్రామంలో ఈనెల 6న నిర్వహించే సీఎం బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని అందుకు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.