ఎమ్మిగనూరు: 'అంబేడ్కర్ కమ్యూనిటీ భవనాన్ని కూటమి నిర్మిస్తుంది'బి.ఆర్ అంబేడ్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి కూటమి అండగా ఉంటుందని బీజేపీ నాయకులు దయాసాగర్, గురురాజ్ దేశాయ్ పేర్కొన్నారు.బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 2018లో ప్రభుత్వం కేటాయించిన 1.60 ఎకరాల స్థలాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. దళితుల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్యే బీవీ సహకారంతో భవనాన్ని నిర్మాణం జరుగుతుందన్నారు.