చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు నివేదించే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు చెప్పారు. శుక్రవారం టిడిపి ఆఫీస్ లో జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ అర్జీలను సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపుతామని,తదుపరి అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారన్నారు.