ఉల్లి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలి: బుట్టా రేణుక ఎమ్మిగనూరు నియోజకవర్గం లోని అధిక వర్షాలతో ముల్లు రైతులు నష్టపోగా ధర లేక కూడా ఇంకా నష్టపోతున్నారని,మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. గోనెగండ్ల మండల పరిధిలోని పుట్టపాశంలో పర్యటించారు. అక్కడ ఉల్లి రైతులను పరామర్శించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం కనీసం మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.