నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీ ని సులభతరం చేస్తూ, పేద, రైతు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడం పట్ల కరీంనగర్ బిజెపి శ్రేణులు మంగళవారం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ,ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టారు.బిజెపి నాయకులు,మాజీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తీసుకుని ముందుకెళ్తోందన్నారు. తాజాగా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల ప్రతీ పేద, మధ్యతరగతి కుటుంబానికి నేరుగా లాభం చేకూరబోతుందని తెలిపారు.