Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 22, 2025
గుడ్లూరు మండలం తెట్టు గ్రామంలో యువకుడిని కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్రావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తెలిపారు. కందుకూరు మండలం ఓగూరు గ్రామానికి చెందిన యువకుడు తన అమ్మమ్మ ఊరైన తెట్టు గ్రామానికి వచ్చిన సమయంలో కొందరు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి సింగరాయకొండ మండలం శానంపూడికి తీసుకెళ్లి దాడి చేసినట్లు చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.