మాదకద్రవ్యాలకు అలవాటు పడితే యువత భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడుతుందని భీమడోలు ఎక్సైజ్ సీఐ నన్నపనేని కళ్యాణి అన్నారు. భీమడోలు మాధురి కళాశాలలో శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన సమావేశంలో సీఐ కళ్యాణి పాల్గొన్నారు. ఈమేరకు విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ యువత తమ విలువైన జీవితాలను మత్తు పదార్థాలకు బలి చేయకూడదన్నారు. మత్తు పదార్థాలపై శాశ్వత పోరాటానికి ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. మాదకద్రవ్యాలు శారీరక, మానసిక అనారోగ్యానికి, కుటుంబాల పతనానికి మూలకారణం అన్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.