పంటలకు అవసరమైన మేరకే యూరియా వాడాలని వ్యవసాయ శాఖ ఏడీ.నాగరాజు సూచించారు.నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరంలోని రైతుసేవ కేంద్రంలో సోమవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో యూరియా అధిక మోతాదు,పంటలపై దాని పర్యవసానం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయాధికారి నాగరాజు, కావలి మండల వ్యవసయాధికారినీ లలిత హాజరయ్యారు.