శ్రీశైలం జలాశయాన్ని ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మెన్ బీపీ పాండే సభ్యుడు మెంబెర్ జాంటిడ్ పరిశీలించారు.KRMB తొలిసారిగా చైర్మన్ గా నియమితులైన తరువాత డ్యామ్ ను పరిశీలించారు.ఈ మేరకు జలాశయం ప్లంజ్ పూల్,క్రస్ట్ గేట్లు, గ్యాలరీ లోని సిపిఎస్ పంపింగ్ సిస్టం అలాగే ఇన్స్ట్రుమెంట్స్ పనితీరు నీటి నిల్వలకు సంబంధించిన విషయాలను చీఫ్ ఇంజనీర్ కబీర్ భాష ను అడిగి తెలుసుకున్నారు.అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో జలాశయం సంబంధించి చర్చించారు. శ్రీశైల జలాశయ లోటుపాట్ల గురించి తెలుసుకొని అనంతరం కుడి,ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు.