రాయనిగూడెం శివారులో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం కారు, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారు చింతలపాలెం మండలం ఎర్రగుట్టు తండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.