20 సంవత్సరాల క్రితం వామపక్ష పార్టీలు చేసిన పోరాట ఫలితమే నేడు ప్రజలను అనుభవిస్తున్న ఉచిత విద్యుత్ అని సిపిఎం సిపిఐ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు ఆర్ మహిపాల్ గోపాల్ రెడ్డి మహేందర్ అన్నారు. గురువారం విద్యుత్ పోరాటం జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో విద్యుత్ పోరాట అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల పెట్టుబడి శ్రామికుల కష్టార్జితంతో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించారని, కానీ నాటి ప్రభుత్వము ప్రపంచ బ్యాంకు సంస్కరణలో భాగంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు చేసిందన్