తెలుగుదేశం పార్టీ మహిళల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కట్టుబడి ఉందని వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. బుధవారం వేమూరులోని ఎన్టీఆర్ పురంలో జరిగిన స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా సాధికారత కోసం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, యువత, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారని తెలిపారు. ఈ సభలో వేమూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి వేలాది మంది మహిళలు పాల్గొన్నారు.