సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం లోని గాండ్లపెంట మండలం తూపల్లి గ్రామంలో మన్సూర్ అనే వ్యక్తి తన భార్య మెహతాజ్ ను కుటుంబ కలహాలతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త గాండ్లపెంట మండలపోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.