ఆపదలో ఉన్నవారికి తోటివారికి సహాయం చేయడం మానవత్వమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం పట్టణంలోని ముగ్గురు బాధితులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం రూ 20 వేలు సహకారం అందించారు. భీమవరం పట్టణంలో బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న 1 వార్డుకు చెందిన ఆఫీయా, 7,13వ వార్డుకు చెందిన రామారావు, కుమారి లకు రూ 20 వేలను ఆంధ్రక్రికేట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, భారత్ క్రికిట్ జట్టు మేనేజర్ పులపర్తి ప్రశాంత్ సహకారంతో అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.